నీటిలోని గలగలలు నా మనస్సు తట్టి లేపాయి.
స్వరాలేవో విప్పి తేనేపాట పాడాయి.
తొలి సంధ్య విరిజల్లు ప్రశాంత ఉషస్సులో
ఏటిలోని పాటలే నా మాటలై రాలాయి.
కదులుతున్న అలలే కావ్యాలై నిలిచాయి.
ఉషోదయ కాంతిలో
ఆవలి ఒడ్డుకి నౌకలో
నదిపైన నావలు
ఏరుదాటే ఒరవడిలో
పడవకాని చేయూతతో తీరం దాటుతున్నాను.
ఆ కాస్తదూరానికి అతనినే నమ్మాను.
సుడి తిరిగే తెప్పలో స్వరమంతా విప్పాను.
Stories
Dec 2020