నేను చదివిన పుస్తకాల గురించి రాయాలని చాలా రోజులుగా నాకొక అలోచన ఉన్నది. మొట్టమొదటిగా చదివిన Jules Verne నవల Around the World in Eighty Days, యింకా Alexandre Dumas, The Three Musketeers నుంచి యిటీవల చదివిన పుస్తకాల వరకు ప్రపంచ సాహిత్యంలో అభిమానులను, పాఠకులను, అలరించిన పలు పుస్తకాలను నేను చదవడం జరిగినది. ఈ ప్రయాణంలో నేను చదివింది నవలలనే చెప్పుకోవాలి. Poetry, Drama, Biography, Philosophy కన్నా Fiction నేను ఎక్కువగా చదవడం తటస్థించింది. దీనికి ప్రధానమైన కారణం నవలలు నాకు అందుబాటు లో ఉండడమే. Non -detailed పుస్తకాల ద్వారా Syllabus లో కుదించబడిన నవలలు 12 వ తరగతి వరకు చదివిన తర్వాత నేను చదివిన మొట్టమొదటి నవల, అమెరికన్ సాహిత్యంలో ఆణిముత్యం అని చెప్పుకోదగిన Harper Lee ‘To Kill A Mocking Bird.’ ఈ నవల మా కాలేజీ లైబ్రరిలో పాత పుస్తకాల కట్టల క్రింద పడి ఉండగా తీసుకుని చదివాను. నల్లజాతి వారిపై అమెరికన్ సమాజంలో అంతర్లీనంగా కొనసాగుతున్న జాత్యహంకార ధోరణి, సామాజిక వివక్ష పై Atticus Finch చేసే సైద్దాంతిక, నైతిక, గాంధీయ పోరాటాన్ని ఈ నవలలో రచయిత అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఈ నవలలోని బాల్య స్మృతులు, అద్బుత వర్ణణ నన్ను బాగా అకర్షించాయి. ఆ తరువాత యిదే నవలను సినిమా రూపంలో (Atticus Finch పాత్రలో Gregory Peck) కూడా చూడడం జరిగింది. ఈ నవల చదువుతున్న సమయంలోనే తిరుపతి RTC Bus Station లోని పుస్తకాల షాపులో సాయంత్రం లేదా శెలవు దినాల్లో (స్నేహితుల షాపు కాబట్టి) గడపడం, పుస్తకాలు తీసుకుని చదవడం నాకొక అలవాటుగా మారింది. ఈ క్రమంలో వరుసగా Pulp Fiction కోవకు చెందిన Jeffrey Archer, Irving Wallace, Harold Robbins, Sidney Sheldon, Frederick Forsyth, Irwin Shaw, Mario Puzo, Eric Van Lustbader లాంటి వారి నవలలు చాలా వరకు చదివాను. Kane and Abel, Blood Line, First among Equals, Honor among Thieves, The Prodigal Daughter, The Almighty, Wheels, The Ninja, Godfather, The Sicilian, Day of the Jackal, Valley of the Dolls, The Odessa File లాంటి నవలలన్నీ చదివాను. ఆనాటి formative stages లో ఈ విధంగా English Fiction ఎక్కువగా చదవడం వల్ల నా English స్కిల్స్ కూడా బాగా improve అయ్యాయని చెప్పవచ్చు. గొప్ప సాహిత్యం కోవలోకి చేర్చలేకపోయినా, Popular Fiction కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఎక్కువ
మంది పాఠకులను ఆకర్షించడమే కాకుండా యిలాంటి నవలలు Popular Culture లో ప్రధాన భాగస్వామ్యులైనాయి. ఉదా: The Godfather, The Day of the Jackal, The Sicilian, Odessa File, The Almighty లాంటివి మంచి చలన చిత్రాలుగా తీయబడి విజయవంతమైనాయి.
Book shop లో ఈ పుస్తకాలు నేను చదవడం, పూర్తి అయిపోవడం, క్రొత్త Titles రాకపోవడంతో నేను పుస్తకాల కోసం వెతుకులాడేవాడిని. మా డాడీ చదివే Erle Stanley Gardner ‘Perry Mason’ రచనలు చాలా ఉన్నా, అవి ఎందుచేతనో నాకు నచ్చకపోవడం చేత ఎలాగైనా పుస్తకాలు కొనుక్కోవాలని అనుకునేవాడిని. డిగ్రీ మూడవ సంవత్సరంలో మా Book Shop friend తో కలిసి Madras వెళ్ళి, Publishers Branches అన్నీ తిరిగాను. చాలా పుస్తకాలు కనబడినా కొనుక్కునే స్థోమత లేక Daniel Defoe రాసిన Robinson Crusoe hardbound edition కొనుక్కున్నాను. నవలా సాహిత్యం, fiction చదవడంపై నాకు అచంచలమైన ఆసక్తి, ఆ విధంగా ఏర్పడి స్థిరపడి పోయింది. రాబిన్ సన్ క్రూసో నవలను అపురూపంగా చదివాను. ఆంగ్ల సాహిత్యంలో, తొలి తరం నవలల కోవలోకి ఈ నవల వస్తుంది. ఓడ ప్రమాదంలో, మానవ సంచారం లేని ఒక ద్వీపంపై చిక్కుకుపోయిన నావికుడు రాబిన్ సన్ క్రూసో కధే ఈ నవల. సమకాలీన సమాజంలో వెల్లివిరుస్తున్న అభ్యుదయవాదం, మానవ సామర్థ్యం (ఆంగ్లేయుల) నిశ్చలమైన పట్టుదల, ఆటవిక సమాజానికి నాగరికత నేర్పడంలో, తెల్లవారి బాధ్యత, (So called White Man ‘s Burden) (నవలలో క్రూసో, My Man Friday కు తనకు తెలిసిన విషయాలన్నీ నేర్పిస్తాడు), యివి కాక the Renaissance Spirit మరియు ఆధునిక వాదం యెక్క ఛాయలు మనం ఈ నవలలో చూడవచ్చు. యింకొక పాత్ర లేకుండా ఈ నవల దాదాపు 200 పేజీల పైన నడుస్తుంది.
లాటిన్ లో Novus, Italian లో Novelle నే తర్వాత కాలంలో Novel అనగా కొత్తదిగా రూపాంతరం చెందింది. ఆంగ్ల నవల పుట్టుక లేదా దాని మూలాలు అన్వేషించే క్రమంలో సాహిత్య విశ్లేషకులు, చరిత్రకారులు రాబిన్ సన్ క్రూసోను ప్రముఖంగా
ప్రస్తావిస్తున్నారు. నాటకాల పరిధిని దాటి నవల ఒక ప్రముఖ సాహిత్య ప్రక్రియగా ఎలా రూపుదిద్దుకున్నదో తెలుసుకోవాలంటే ఆనాటి సామాజిక, ఆర్థిక, చారిత్రక పరిస్ధితులను పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. Classicism లేదా సనాతనవాదుల నిబంధన చట్రాలతో సృజించవలసిన epic, లేదా drama కు విరుద్ధంగా నవలా ప్రక్రియ పూర్తి స్వతంత్రత, స్వేచ్ఛను ప్రసాదించింది. Classical drama లోంచి బయటపడి తనదైన శైలిలో ప్రపంచ సాహిత్యానికి అధ్భుత గ్రంధాలందించిన Shakespeare పయనం మరొక అంశం.
కథ, వర్ణణ, ఆలోచన, సంఘర్షణ, తర్కం, చరిత్ర, యింకా సామాజిక, సమకాలిన జీవితంపై ఒక Commentary గా నవల, అనువైన సాధనంగా మారింది. ఛాందస సాహిత్యకారులు, కవుల పరిధి లోంచి విడిపడి ఒక ప్రజాస్వామ్య సాహిత్య ప్రక్రియగా మారింది. తన గదిలో, తన యింట్లో కూర్చుని అందరూ వాడే భాషలో తన భావాలను ప్రపంచానికి తెలియచెప్పే బృహత్తర సాధనంగా నవల మారింది. నవలలో అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నది, అవకాశం ఉన్నది. రచయిత విభ్రాంతి గొలిపే వేగంతో ఎన్నెన్నో అంశాలను సృజించవచ్చు. మూడు ఉదాహరణలుగా Tolstoy, War and Peace, George Elliot, Middle March మరియు Margaret Mitchell Gone with the Wind లను చెప్పుకోవచ్చు. అందుకే Marion Crawford నవలను “Pocket Theatre” అంటాడు.
నవల ఎలా రూపుదిద్దుకున్నదో యింకొంత విపులంగా పరిశీలిస్తే Boccaccio వ్రాసిన Decameron, Chaucer వ్రాసిన Canterbury Tales మరియు John Bunyan వ్రాసిన Pilgrims Progress లాంటి గ్రంధాలలో కథ, దాని స్వరూపం, కథాగమనం (Plot and Narrative) పాఠకులను ఉద్దేశించి కథ చెప్పే విధానం, ఒక నైతిక పాఠం, సమాజానికి సందేశం లాంటి లక్షణాలను మనం గమనించవచ్చు. గ్రీకు నాటక కర్తలు ప్రవచించిన the three unities of a classical play, unity of
time, place, action లాంటి సూత్రాలకు విరుద్దంగా, నవల సమాజంలోని వ్యక్తుల తులనాత్మక పరిశీలనగా ఆవిర్భవించడం మనం గమనించవచ్చు. అదే సమయంలో యూరోప్ ఖండంలోని యితర దేశాలలో నవల ఒక స్వతంత్ర సాహిత్య ప్రక్రియగా ఆవిర్భవించి అద్భుతమైన రచనలను పరిచయం చేయడం జరుగుతూ ఉంది. Miguel de Cervantes వ్రాసిన Don Quixote De La Mancha తన సహాయకుడు Sancho Panza మరియు తన వయసుడిగిన గుర్రం సహాయంతో అసహజమైన ఆదర్శభావాలు, ఉధార స్వభావం కలిగి, ఆపదలో ఉన్న మహిళలు, ఆనాధలను ఆదుకోవాలనే భావుకతతో కొట్టుమిట్టాడే ఒక వృద్ధ యోధుడు Don Quixote గాథే ఈ నవల.
Don Quixote నవల రాబోయే నవలా రచయతలకు కొన్ని చక్కని విధానాలను అందించింది. ఉదా – Picaresque Novel లో Hero దేశాటనకో, పర్యటనకో, యాత్రకో బయలు దేరుతాడు. Picaresque నవలను తొలితరం నవలాకారులు చాలా మంది ఉపయోగించడం జరిగినది. Tobias Smollett, Henry Fielding, Laurence Sterne, Samuel Richardson లాంటి తొలినాటి ఆంగ్ల నవలాకారులు ఈ సాహితీ ప్రక్రియను విరివిగా ఉపయోగించుకున్నారు. నవలలోని పాత్రధారుల అన్వేషణ లేక వ్యక్తిగత ప్రయాణాలలో వారికి ఎదురైన అనుభవాలు సంఘటనల ఆధారంగా ఈ నవలలు నిర్మించటం జరుగుతుంది. నాయకులలోని మంచి లక్షణాలు, ప్రతినాయకులలోని అవలక్షణాలు కధా గమనంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే ఆనాటి సమాజంలో నెలకొన్న పరిస్థితులు, వర్గ విబేధాలు, మహిళల పట్ల వివక్ష, దుర్వ్యసనాలు, సామాజిక పరిస్థితులపై రచయత వ్యంగ్యాస్త్రాలు లాంటివన్నీ (Social Satire) రచనలో భాగమై ఉన్నాయి. స్వతహాగానే యిలాంటి నవలల్లో melodrama శాతం ఎక్కువగా వుండేది. సునిశితమైన మానసిక విశ్లేషణ కన్నా, పాత్రల మధ్య చెలరేగే సంఘర్షణ, ప్రేమ, వైరాగ్యం, లాంటివి ఎక్కువగా చిత్రీకరించడం జరిగుతుంది.
Picaresque లేదా సాహసోపేతమైన వృత్తాంతంలో భాగంగా కధానాయకుడు వివిధ గ్రామాలు, పట్టణాలు, సందర్శిస్తూ అక్కడ వివిధ రకాల adventures సాహస కార్యాలలో పాలుపంచుకుంటాడు. తొలినాళ్ళలో నవలాకారులు సాధించినటువంటి ఈ స్వేచ్చాయుత కధా విధానం; (the omnipotence, the omnipresence and the omniscience of the Novelist) నవలా ప్రక్రియను పూర్తిగా సాహిత్యకారుడి స్వయంసిద్ధ ప్రక్రియగా నిలబెట్టాయి.
తర్వాతి కాలంలో Ulysses లాంటి మహాకావ్యంలో James Joyce పై ప్రక్రియకు పూర్తి విరుద్ధమైన ప్రక్రియ. నవలాకారుడి ప్రమేయం లేని Stream of Consciousness technique ను అవలంబించారు. కాని పాత్రలు తమ స్వభావ రీత్యా సంభాషించినా వాటికి జీవం పోసేది నవలాకారుడే కాబట్టి నవల ఒక స్పష్టమైన individual effort, వ్యక్తిత్వ నిదర్శనంగా మనం చాటవచ్చు. నవలా ప్రక్రియ గురించి ఒక ప్రముఖ విమర్శకుడు ప్రస్తావిస్తూ, the Art of Writing Fictionను Telling and Showing గా వర్గీకరిస్తాడు. Henry James లాంటి 20 వ శతాబ్దపు నవలా రచయితలు మరియు F. R Leavis లాంటి ఆధునిక విమర్శకులు, నవలానువాద ప్రక్రియలో Showingకే ప్రాధాన్యత యిస్తారు. యిక్కడ Telling అంటే రచయిత సర్వాంతర్యామియై జరిగిన, జరుగుతున్న, జరగబోవుతున్న అన్ని సంఘటనల గురించి సమగ్రంగా చర్చించటం. దీనికి భిన్నంగా Showing అంటే నవల స్వరూపం, దాని యొక్క శిల్పం, కథా గమనాన్ని, పాత్రల మధ్య నడిచే సంఘర్షణ, సంభాషణ ఆధారంగా చిత్రీకరించడం. తొలి తరం రచయితలు రెండు techniquesను ఉపయోగించినా ఎక్కువగా తమకు తెలిసిన పరిజ్ఞానం, విజ్ఞానాన్ని సమాజం పట్ల అవగాహనను పాఠకులకు విస్తృతంగా చేరువ చేయటం కోసం Telling అనే techniqueను విరివిగా వాడడం జరిగింది.
ఆనాటి సమాజంలో భాగ్యవంతుల జీవనశైలి, వారి వ్యక్తిగత జీవితాలలోని అపరిపక్వత లేదా అనైతికతలను ప్రస్తావించడానికి రచయితలు ప్రాధాన్యత నిచ్చేవారు. ఉదా: Tom Jones నవలలో వివాహ బంధం వెలుపల జన్మించిన (Tom Jones) చివరికి ఎవరింట్లో అయితే చేరదీయబడతాడో, ఆ భాగ్యవంతుడు, ఊరికి పెద్ద యొక్క చెల్లెలు కొడుకుగా కనుగొనబడతాడు. వివాహానికి ముందు ఆమె చేసిన పొరబాటు వలన జన్మించిన Tom, సాధారణ జీవితం గడుపుతూ Bastard గా భావించబడతాడు. British సమాజం లోని Class Conflict కూడా రచయిత ఈ విధంగా స్పృశిస్తాడు. ఒక పూట కూళ్ళ యింట్లో సరదాగా గడిపే సమయంలో లైంగికంగా దగ్గిరయిన మహిళ తర్వాత, తన కన్న తల్లి అని
తెలుసుకొని Tom Jones incest అనే sin లేదా దుష్ప్రవర్తనకు లోనయ్యానని బాధపడతాడు. కానీ ఆమె తన కన్నతల్లి కాదని తెలిసిన తర్వాత, యిది సహజ సిద్ధంగా
మరిచి పోబడుతుంది. Tobias Smollet రాసిన Humphry Clinker లోనూ యిలాంటి కధా విశేషాలు కనబడతాయి. అనాధగా పిలవబడే Humphry Clinker పలు సందర్భాలలో తన యజమాని Bramble కు దగ్గిరవడం ఆయన దయాభిమానానికి పాత్రుడవడం జరుగుతుంది. నవల చివర్లో Clinker తనకు వేరొక మహిళతో (out of wedlock) జన్మించిన పుత్రుడిగా కనుగొని Sir Bramble ఆనందపడతాడు. Tom Jones, Joseph Andrews లాంటి నవలలలో, authorial voice, రచయిత యొక్క వాక్కు ప్రముఖంగా వినబడుతుంది. ఎంతగా అంటే ప్రతి అధ్యాయం ముందు రచయిత కథ, పాత్రలు, లోకం పోకడ గురించి సింహవలోకనం చేస్తాడు. Fielding రాసిన ‘Tom Jones’ నవలను Comic-Epic కోవలో మనం చూడవచ్చు. ఈ నవలను మొట్టమొదట తరంలోని అద్వితీయ నవలగా వర్గీకరిస్తూ Coleridge మహాశయుడు Oedipus Tyrannus మరియు Ben Jonson రాసిన Achemistతో పాటు అద్భుతమైన Plot (కథా విశేషం) కలిగిన నవలగా కీర్తించారు.
Epistolary Novel: Tom Jones నవలను Somerset Maugham కూడా అద్వితీయమైన నవలగా కీర్తించారు. నవల యొక్క స్వరూపం, సంవిధానం, పాఠకులకు చేరువ చేయడంలో అవలంభించవలసిన narrative devices లాంటివి అన్నీ 17వ శతాబ్దంలోని పలు నవలల ద్వారా ఒక స్థిరమైన ఏర్పాటు లేదా arrangement లోనికి తీసుకురాబడినాయి. పద్యం లేదా నాటకంతో పోల్చినప్పుడు నవలకున్న విస్తృతమైన పరిధి, సమాజ స్థితిగతులకు అతి సమీప పోలిక, నవలాకారుల శ్రమను సులభతరం చేసినా వారి ఊహా శక్తికి, తార్కిక విచక్షణకు అత్యంత కష్టమైన పరిస్థితి కూడా కల్పించింది. అందుకే నవల అంటేనే కల్పన. రచయిత ఎలాంటి generic form లో నైనా చేసే కల్పన, నవలా ప్రక్రియలో ఉత్కృష్ట స్థాయికి చేరుకుంది. అందుకే ఆంగ్లంలో నవలను Novel కంటే కూడా Fiction అనే పిలుస్తారు. సర్వం: పద్యం, నాటకం, పురాణం, కథ, Fiction – ఊహ అయినా ఒక నవలనే ఈ విధంగా సంబోధించడం వెనుక రచయిత తన మేధస్సును, కల్పనా శక్తిని ఉపయోగించి, ఒక అద్భుతమైన కాల్పనిక జగత్తును సృష్టించడానికి వీలు కల్పించే సాధనంగా నవలను సాహిత్యకారులు చూస్తున్నారని భావించవచ్చు.
తొలినాటి నవల, రాబిన్సన్ క్రూసో గురించి మనం మాట్లాడుకున్నాం కదా. Daniel Defoe తర్వాత వచ్చినటువంటి, Jonathan Swift రాసిన Gulliver’s Travels కూడా చాలా ప్రాచుర్యం పొందిన నవల. తన సాహస యాత్రలో తారసపడిన మరుగుజ్జులు మరియు అజానుబాహులు గురించి Gulliver రాసుకునే స్వీయ చరిత్రలో, మానవాళిపై రచయిత సునిశిత, విమర్శనాత్మక దృష్టి, వ్యంగ్యాస్త్రాలు, కొన్నిసార్లు ఎగతాళి ఈ రచనలో మనం చూడవచ్చు. రాబిన్సన్ క్రూసో కానీ Gulliver’s Travels కానీ, కథానాయకుడు చేసే ప్రయాణాలలో వారి అనుభవాల సమాహారంగా రూపుదిద్దుకున్నాయి. Tom Jones, Joseph
Andrews, Humphry Clinker, Canterbury Tales లాంటి రచనలు కూడా ప్రయాణంలో కథల లాంటివే. కొన్ని సందర్భాల్లో పేదరాశి పెద్దమ్మ కథలు, పూటకూళ్ళ పెద్దమ్మ కథలతో వీటిని మనం పోల్చవచ్చు.
నాయకుడి ప్రయాణాల యితివృత్తంతో, తర్వాత కూడా చాలా నవలలు వ్రాయబడ్డాయి. ఉదా: The Treasure Island, Coral Island, Around the World in 80 days, Journey to the Center of the Earth, Journey to the Moon, The Count of Monte Cristo లాంటి నవలలు ఈ నవలల యితివృత్తాలు పరిశీలిస్తే, సాహస యాత్ర, పరిశోధన, అన్వేషణ, విజ్ఞానపు ఎల్లలు విస్తరించడం, కనుగొనడం లాంటి అంశాలను మనం గమనించవచ్చు.
Renaissance Spirit: ఆధునిక భావాలు మొదలయ్యిన 15వ మరియు 16వ శతాబ్దాలలో ప్రస్ఫుటమైన, ప్రముఖమైన లక్షణంగా Renaissanceను మనం పేర్కొనవచ్చు. Renaissance లేదా rebirthకు కారణాలుగా పలు చారిత్రక ఘట్టాలను చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆధునిక అచ్చు యంత్రం ద్వారా విజ్ఞానం మరియు ఆలోచనలు పంచుకునేందుకు మరింత వేగవంతమైన, సులభతరమైన సాధనం లభించింది. వైజ్ఞానిక స్ఫూర్తి, పరిశోధనాత్మక సరళి, మరీ ముఖ్యంగా మానవుడి శక్తిసామర్థ్యాల పట్ల అచంచలమైన విశ్వాసం ఈ యుగంలో మనకు కనిపిస్తాయి. అందుకే Michelangelo సృష్టి, David లేదా Leonardo Da Vinci, The Vitruvian Man కానీ, మానవ శరీరం యొక్క అద్భుత రీతిని ఆవిష్కరిస్తాయి. Shakespeare ఈ కాలంలో రాస్తూ యిలా అంటాడు.
“Oh! What a noble piece of work is Man.” తర్వాత – Hamlet లో He was a man. Take him all-in-all. You will never see another like him. ” ప్రపంచపు ఎల్లలు కనుగొనే పనిలో నావికులు ఎందరో. Christopher Columbus, Vasco da Gama, Francis Drake, Ferdinand Magellan, James Hope లాంటి వాళ్ళు సముద్రయానం కావించారు.
ప్రపంచాన్ని, నలుమూలల ఉన్న మానవ సమాజాన్ని దర్శించాలని, మొట్టమొదటిగా క్రొత్త ప్రదేశాలను కనుగొన్న ఖ్యాతి తమకే చెందాలని ఈ నావికులు బయల్దేరి ఉండవచ్చు. రాజు యిచ్చే బహుమతి ఎంతైనా, ఈ విజ్ఞాన తృష్ణ ముందుకు నడిపించిందని చెప్పవచ్చు. నర సంచారం కనుగొనలేని ఒక ద్వీపంలో చిక్కుపడిపోయిన Robinson Crusoe, ఆ ద్వీపాన్నీ పరిశీలన చేసి తన సామ్రాజ్యం స్థాపించే పనిలో పడతాడు. వ్యక్తి ఆశావహ దృక్పథం, ఆశయాల సాధన, విస్తరిస్తున్న మేధోన్వేషణను తొలితరం నవలలు బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చాయి. నవలకు ప్రాచుర్యం కల్గించిన వివిధ చారిత్రక పరిస్థితులను గురించి చర్చించినప్పుడు, ఆనాటి సమాజంలో చదువుకున్న, మధ్య తరగతుల ప్రజల ప్రాబల్యం పెరగడం కూడా కారణంగా చూడవచ్చు. ధనవంతులు, బీద వర్గాలకు చెందిన వారిద్దరి మధ్య, చదువుకుని, పారిశ్రామిక విప్లవం అనంతరం క్రొత్త రకాల ఉద్యోగాల్లో స్థిరపడుతున్న ప్రజానీకానికి (ఉదా: – ఉపాధ్యాయులు, గుమాస్తాలు, లేఖకులు, ఖార్ఖానాల పనివారు లాంటి వివిధ ఉద్యోగులు, వారి వినోదానికి, ఖాళీ సమయాన్ని భర్తీ చేసే సాధనంగా నవల అవతరించిందని కూడా మనం చూడవచ్చు. నవల యొక్క Portability (ఎక్కడికైనా మనతో తీసుకు వెళ్లగలిగే గుణం వేరే వినోద సాధనాల కోసం, నాటకం, Opera, సంగీతం, మనమే ఆ చోటకు వెళ్ళవలసి ఉంటుంది.) ఈ సరిక్రొత్త జీవన శైలికి, బాగా అతికిందని కూడా చెప్పుకోవాలి. తమలాంటి సామాన్య స్త్రీ పురుషులు, యువతీ యువకులు, వారి జీవిత గమనాన్ని చిత్రీకరించే నవలను ఎక్కువ మంది ప్రోత్సహించడం సాధారణంగానే జరిగింది. ఆనాటి సాహితీ సాంప్రదాయంలో సీరియల్ గా కథను ప్రచురించడం నవలతోనే ప్రారంభమైందని చెప్పుకోవాలి.
Charles Dickens విశ్వవిఖ్యాత నవల Pickwick Papers మొట్టమొదటగా సీరియల్ గా వార్తాపత్రికల్లో ప్రచురింపబడినది. తొలినాటి సీరియల్ నవలలలో Wilkie Collins రాసిన Woman in White మరియు Moon stone కూడా ఉన్నాయి. ఈ రెండు నవలలు నేర పరిశోధన, మరియు Mystery Novels కోవ క్రిందకు వస్తాయి. నవలలోని ప్రధాన పాత్రధారుల జీవితాలతో ముడిపడి ఉన్న రహస్యం ఛేదించబడడం ఈ నవల్లలోని ముఖ్యాంశం. యిదే తరహాలో సీరియల్ గా ప్రచురించబడిన అద్భుతమైన అపరాధ పరిశోధనా నవల “The Hound of Baskerville”. Crime Thriller genre novels కే తలమానికం లాంటి ఈ నవలలో అపరాధ పరిశోధకుడు Sherlock Holmes తన సహాయకుడు Dr. Watsonతో కలిసి అత్యంత కఠినమైన రహస్యాలను, నేరాలను తన వైజ్ఞానిక, తార్కిక, మేధాశక్తితో, సాహసంతో ఛేదిస్తాడు. సంచలనాలకు మరో పేరు లాంటి Sherlock Holmes అపరాధ పరిశోధనలు ఎంతగా పాఠకులను ప్రభావితం చేశాయంటే, ఈ ఊహాజనిత పరిశోధకుడిని నిజమైన వ్యక్తిగా భావించి, సహాయం కోసం Baker Street కు వెళ్ళేవారని నానుడి.
తర్వాతి కాలంలో బహుశా Sherlock Holmes యిచ్చిన ప్రేరణ వల్లనేమో, అపరాధ పరిశోధకులు, Detective లను చాలా మంది రచయితలు సృష్టించారు, పాఠకులకు దగ్గిర చేశారు. Hercule Poirot, Nancy Drew, Byomkesh Bakshi, Perry Mason లాంటి పాత్రలు కూడా అవతరించాయి. నవల ప్రాచుర్యం పొందడం, అదే సమయంలో నాటకం యొక్క ప్రాధాన్యత తగ్గడం దాదాపు ఒకేసారి 18వ శతాబ్దంలో జరిగింది. విస్తరిస్తున్న మానవుని ఆలోచనలు, సమాజపు ఆటుపోట్లను, నూతన సామాజిక, ఆర్థిక పరిస్థితులను వ్యక్తీకరించడానికి ఒక సరికొత్త సాధనంగా, కళారూపంగా నవల అవతరించింది.
ప్రముఖ సాహిత్య విమర్శకుడు Ian Watt వ్రాసిన The Rise of the Novel లో నాటకం యొక్క ప్రాధాన్యత తగ్గడం గురించి ప్రస్తావించడం జరిగింది. వాస్తవికత నుంచి ఉద్భవించిన కల్పన (fictional realism) గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మారిన సామాజిక పరిస్థితులు, వ్యక్తి తనను తాను అన్వయించుకునే విధానం, వ్యక్తిత్వ సంబంధాలు, శ్రామిక వర్గాల బ్రతుకు పోరాటాలు, సమూహ జీవన విధానం, పట్టణం-పల్లె మధ్య వైరుధ్యం. విస్తరిస్తున్న ఆధునీకరణ, పారిశ్రామికీకరణ, మానసిక సంఘర్షణ, వర్గ వైషమ్యాలు, బానిస బ్రతుకులు లాంటి వెన్నో యితివృత్తాలు నవలలో భాగమైనాయి. ఎంతగా అంటే యిందులో ఒక్కొక్క యితివృత్తం ఆధారంగా వ్రాసిన నవలల గురించి కొన్ని సంపుటాలు వ్రాయవచ్చు.
నేను పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది, Non-detailed texts గా యివ్వబడిన నవలల నుంచేనని యింతకు మునుపే చెప్పాను. అలా నేను చదివిన మొదటి పుస్తకం, Mark Twain వ్రాసిన Adventures of Tom Sawyer. ఆధునిక అమెరికన్ సాహిత్యానికి Mark Twain రచించిన Adventures of Huckleberry Finn పునాది లాంటిదని Hemingway అంటాడు. ఈ రెండు పుస్తకాలను యిష్టపడని వారేవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.
మిసిసిపీ మహానదిని ఆనుకుని New Orleans కేంద్రంగా Mark Twain రచించిన ఈ రెండు పుస్తకాలు మనిషికీ, ప్రకృతికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం, బాల్యం, స్నేహం, సాహస క్రీడలు, ఒకానొక తరంలో అమెరికన్ సమాజం (Southern States) లో నెలకొన్న సామాజిక పరిస్థితులు, ప్రకృతి ఆరాధన, ప్రకృతిలోని నైర్మల్యం, మనిషిలోని కల్మషం లాంటి యితివృత్తాలను మనకు తెలియజేస్తాయి. ఈ రెండు పుస్తకాలు నన్ను విపరీతంగా ఆకర్షించాయి. జీవితంలో కొన్ని దినాలైనా, Huckleberry Finn లాగా స్వేచ్ఛగా, నాగరికతకు, కట్టుబాట్లు (Hypocrisy) వంచనకు దూరంగా జీవించగలిగే అవకాశం
దక్కుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాను. Mark Twain రచించిన The Prince and the Pauper, Life on the Missisipi లాంటి పుస్తకాలు కూడా మిసిసిపి మహానది వర్ణనతో మనలను ఆకట్టుకుంటాయి. నాగరికత అన్నది మానవుడి సహజ అనుభూతికి, ఆనందానికి ఏ విధంగా సంకెళ్ళు వేస్తున్నదో Mark Twain నవలల్లో మనం గమనించవచ్చు. అందుకే Mark Twain ఒకచోట అంటాడు “My going to school did not interfere with my education. ” ప్రకృతి పట్ల ఈ విధమైన ఆనందానుభూతి, ఆరాధన, విభ్రాంతి Henry David Thoreau పుస్తకం Walden లోనూ కనబడుతుంది. అలాగే Hemingway రచన “The Old Man and the Sea” లో మనిషికీ ప్రకృతిలోని యితర జీవరాశులకు ఉన్న అనుబంధాన్ని, మత్స్యకారుడికి, అతని వలలో చిక్కిన చేపకు మధ్య జరిగిన సంఘర్షణలో మనం దర్శించవచ్చు. Thoreau రచన Walden లో నాగరిక సమాజానికి దూరంగా, అతి తక్కువ అవసరాల కోసం ప్రకృతి మీద ఆధారపడుతూ ప్రకృతితో సహజీవనం చేసే Philosopher, Naturalist ను మనం చూడవచ్చు. అమెరికన్ సాహిత్యంలో ఈ దైవిక ప్రకృతి ఆరాధన, ఎంతో ఉదాత్తమైన, అద్భుతమైన Natural Philosphy లను Mark Twain రచనలు తారస్థాయికి తీసుకెళ్లాయని చెప్పవచ్చు. జన్మనిచ్చిన తండ్రి తనను పట్టించుకోకపోగా తనను పెంచిన నల్లజాతి వ్యక్తి “Ole Jim” పట్ల పెంచుకునే ఆత్మీయ ప్రేమ, Huckను ఎలాగైనా చెడు మార్గం నుంచి మళ్ళించి, మంచి విద్య, నడవడిక నేర్పాలని Widow Doughlas పడే తపన, కానీ ఈ కఠిన నియమావళి, ఈ యిరుకున పెట్టే అసహజ దుస్తులు, పోకడలను తట్టుకోలేక మిసిసిపి నదిపైకి తన పడవలో వెళ్ళిపోతాడు Huck. ఒకానొక నిర్మలమైన రాత్రివేళ మిసిసిపి నది పైన తన తెప్పలో ఓలలాడుతూ, ఆకాశంలో జాబిల్లిని, తారలను చూస్తూ తాదాత్మ్యతతో తన పైపు కాల్చుకుంటూ, ఈ ప్రపంచంలోనే అమర లోకపు సుఖాన్ని అనుభవించే Huck Finn జీవితాన్ని Mark Twain ధన్యం చేస్తాడు. Huck Finn పాత్ర ద్వారా Mark Twain అసమంజస, అసహజమైన నాగరిక పోకడలపై, వంచనతో కూడిన సామాజిక కట్టుబాట్లు (hypocritical values) పై తన నిశిత దృష్టిని సంధించాడు. మహా సాగరాన్ని తలపించే మిసిసిపి పై తన Steamboat జీవితపు అనుభవాలను Life on the Missisipi లో కూడా పంచుకుంటాడు. The Prince and the Pauper నవలలో తారుమారైన యిద్దరు యువకుల స్థితిగతుల గురించి చమత్కారంగా వర్ణిస్తాడు. యిదే నవలకు కొంచెం అటు-యిటుగా తెలుగులో రాజు-పేద అనే సినిమా, తమిళంలో నాడోడి మన్నన్ అనే సినిమాలు ఉంటాయి. నాడోడి మన్నన్ సినిమాకు Anthony Hope రాసిన Prisoner of Zenda కూడా ప్రేరణ అయి ఉండవచ్చు.
అమెరికన్ సాహత్యం గురించి చర్చిస్తున్నందున యిదే సమయంలో నవలలలోకెల్లా ఉత్తమ నవలగా Critics Polls లో పలు సందర్భాలలో ఎంపిక కాబడిన Margaret Mitchell Novel “Gone With the Wind” గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ నవలలో Rhett Butler, Scarlett O’Hara ల జీవిత గాథను రచయిత అద్భుతంగా చిత్రీకరించారు. Rhettను ఎప్పటికీ ప్రేమించలేని O’Hara తన స్నేహితురాలి భర్తనే ప్రేమించి పొందాలనుకుంటుంది. ఈ ముక్కోణపు ప్రేమ వ్యవహారంలో చివరికి ఎవరు విజయం సాధిస్తారో, లేదా ప్రేమలన్నీ సాఫల్యం పొందాయా లేదా అనే సంశయాన్ని మనం పక్కన పెడితే, ఈ నవల 18, 19వ శతాబ్దపు అమెరికన్ సమాజానికి, బానిస విధానానికి, తిరుగుబాటుకి ఆనాటి జీవనసరళికి నిర్వచనముగా, ఒక monumental epic లేదా magnam opusగా నిలిచిపోతుంది. ఈ నవల సినిమా versionలో Clark Gable, Vivien Leigh లు అద్భుతంగా నటించి మెప్పించారు. నల్ల జాతి వారిపట్ల ఈ నవలలో తిరస్కారం లేదు గాని వారి జీవితంలోని వేదన, ధనవంతులైన భూస్వామ్య తెల్లవారి ప్రాపకంలో, వీరు ఏ విధంగా వివక్షకు గురికాబడినారో లాంటి విషయాలు patronizing attitude కు లోబడి చిత్రీకరించబడ్డాయి. అమెరికా అంతర్యుద్ధం నేపథ్యంలో సాగే ఈ నవల Margaret Mitchellకు అజరామరమైన కీర్తి తెచ్చిపెట్టింది.
Rhett Butler మరియు Scarlett O’Hara పాత్రలను రచయిత్రి చక్కగా తీర్చిదిద్దారు. ఎవ్వరికీ తలవంచక, మిడిసిపడే వనిత O’Hara. Rhett మరియు O’Hara మధ్య నడిచే యిష్టం కానీ కష్టం లాంటి ప్రేమ కథ, చురుకైన సంభాషణకు దారితీస్తుంది. ఆనాటి జీవితం, గతకాలపు వైభవం, రెప్పపాటులో మాయమైందని రచయిత్రి భావం కావచ్చు. అందుకే ఈ నవలలో మనకి Nostalgia కనిపిస్తుంది. అమెరికా దక్షిణాది రాష్ట్రాలలో అమలులో ఉన్న భానిస విధానాన్ని నవలలో మానవీయ కోణంలో (O’Hara మరియు ఆమె అక్కను పెంచే Nanny పాత్రలో) వారి గృహంలో కార్యాలు నిర్వహించే సేవకుల పాత్రల ద్వారా సృష్టించడానికి ప్రయత్నం చేసినట్లు కనబడుతుంది. అంతర్లీనంగా ఉన్న బలమైన జాతి వివక్షను, వర్గ విభేదాలను అందమైన కుటుంబ విలువల ముసుగులో ఈ నవల నల్లజాతి వారు తమకు ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అవకాశాలతో సంతృప్తిగా ఉన్నట్లుగా చూపిస్తుంది.
కానీ Gone with the Wind కంటే ముందు ప్రచురింపబడి అమెరికా అంతర్యుద్ధానికి బలమైన కారణంగా పేర్కొనే Harriet Beecher Stowe నవల Uncle Tom’s Cabin, నల్లజాతి వారిపట్ల ఆనాటి అమెరికా భూస్వాములు, ధనవంతులు, పెత్తందారులు సాగించిన అమానవీయ, క్రూరమైన విధ్వంసకాండను బట్టబయలు చేసింది. ఆఫ్రికా ఖండంలో అలవర్చుకున్న నమ్మకాలు, విలువలను విడనాడి నల్లజాతి వారు క్రైస్తవ్యం పట్ల మొగ్గు చూపుతున్న సమయం అది. విశృంఖలంగా జరుగుతున్న జాత్యహంకారం, తెల్లజాతీయుల దమనకాండ నేపథ్యంలో ప్రేమ స్వరూపుడు దేవుని పుత్రుడి బోధనలలో శాంతి వెతుక్కుంటూ ఓదార్పు కోరుకునే పాత్రలో Uncle Tom కనిపిస్తాడు. నల్ల జాతి బానిస సమస్తం: అతని సమయం, శరీరం, శక్తి, భార్య, బిడ్డలు అందరూ, అన్నీ తెల్లజాతి Master సొంతం. ఒక్కోసారి Master మంచివాడైనా అతని పిల్లలో లేదా పర్యవేక్షించే overseer లేదా supervisor రాక్షసత్వానికి, స్వార్దానికి వీరు బలి కావాల్సిందే. ఈ వికృత క్రీడలో నల్లజాతి భానిస కోరుకునేది కనీసం తన కుటుంబం అందరూ ఒక Master క్రింద ఉండాలని. కానీ ఆ అవకాశం కూడా వారికి ఉండేది కాదు. వస్తువుల కంటే హీనమైన వారి జీవితం మాస్టర్ పెంచుకునే కుక్కలు, గుర్రాల కంటే హీనమైనదిగా భావించబడేది. వారికి ఎటువంటి బాధలు, బాంధవ్యాలు, మానవీయ భావాలు ఉండవు. కట్టు బానిసలుగా నల్లజాతి వారు మాస్టర్ పత్తి, చెరకు పొలాల్లో శ్రమ పడటం ఈ నవలలో మనం చూడవచ్చు. వేల ఎకరాలు నిడివి ఉండే ఈ estates లో Master బానిస భార్యలను బిడ్డలను అమ్మివేస్తే యిక ఈ జీవితానికి వారిని మరచిపోవలసిందే. ఒక్కోసారి స్వేచ్ఛ కోరుకుని ధైర్యం చేసి బానిసత్వం లేని ఉత్తరాది రాష్ట్రాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తే, తప్పించుకుని పోయే బానిసలను వేటాడేందుకు తెల్లజాతి జాగిదార్లు, యజమానులు అవలంభించే పద్ధతులు, వారి ఏర్పాట్లు, కిరాతక చర్యలు, ఒళ్ళు గగుర్పొడింప చేస్తాయి. ఈ నవల చదివినాక మనిషి యింకొక మనిషి పట్ల యింతటి అమానుషాన్ని చూపించగలడా, యింతటి క్రూరత్వం ఈ జీవితంలో సాధ్యమా అని అనిపిస్తుంది. అమానుషాన్ని, క్రూరత్వాన్ని, ఓర్పుతో, శాంతితో ఎప్పటికైనా పరివర్తన రాకపోతుందా అని క్రీస్తు మార్గాన్ని ఆచరిస్తూ గడిపే Uncle Tom కరుణారస హృదయం మనలను కదిలిస్తుంది. యిలాంటి యితివృత్తంతో Alex Haley రాసిన Roots నవల కూడా తర్వాతి కాలంలో చదివాను. ఆఫ్రికాలోని గాంబియా నుంచి, అపహరించబడి బానిసగా మార్చబడిన తన ఏడు తరాల పూర్వికుడు Kunta Kinte మూలాలు అన్వేషించే క్రమంలో Alex Haley రాసిన ఈ అద్భుతమైన నవల, ఆఫ్రికా సమాజంలోని ఔన్నత్యాన్ని ఆనాటి బానిస వ్యాపారం ముసుగులో తెల్లజాతీయులు సాగించిన దమననీతి, దోపిడీని కళ్ళకు కట్టినట్లు బట్టబయలు చేస్తుంది. (అపహరించబడిన వారిని తప్పించుకునే వీలు లేకుండా కాళ్ళకు, చేతులకు సంకెళ్లు తగిలించి, ఓడ బాయిలర్ కోసం బొగ్గును దాచే గదిలో బంధిస్తారు). ఈ నవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి ప్రతి మనిషికీ ప్రసాదించిన స్వేచ్ఛకు సామ్రాజ్యవాదం, వలసవాదం లాంటి అందమైన పదాల ముసుగులో రంగు, జాతి, రూపం లాంటి భేదాలతో చేసిన నికృష్ట వ్యవహారాన్ని ప్రపంచం కళ్ళకు కనబడేటట్లు చేసింది. హిట్లర్ సాగించిన యూదు “ఊచకోత” (genocide) ను మించిన దీని ప్రభావం ఆ శతాబ్దాలలో చరిత్రకారులు ఎందుకు ఉదహరించలేదో యిప్పటికీ అర్థం కాదు. యిటీవల విడుదలైన 12 Years A Slave సినిమాలో కూడా మనం యిది గమనించవచ్చు. యింకా Underground Rail Road అనే నవల (Colson Whitehead) Pulitzer రచనలో కూడా యిది చూడవచ్చు. చరిత్ర లేదా Popular discourse ఎంత selective లేదా deceptiveగా ఉంటాయో తెలుసుకోవడానికి ఎక్కువగా శోధించనవసరం లేదు. ఆఫ్రికా ఖండానికి Dark Continent అనీ, India కి the land of beggars and snake charmers అని పాశ్చాత్యులు అప్పుడప్పుడూ పిలుచుకునే రీతి, popular discourses లోంచి వచ్చినవే. ముఖ్యంగా ఆఫ్రికా గురించి ఉన్న యిలాంటి mythsను పటాపంచలు చేస్తూ ఆ సమాజంలోని సహృదయతను, ఉన్నతిని, Roots, Things Fall Apart, Segu, Long Walk to Freedom లాంటి రచనలు ప్రపంచానికి చాటి చెప్పాయి.
నేను నవలలు చదవడం ప్రారంభించిన రోజులలో నాకు ఎక్కువగా అందుబాటులో ఉన్నవి రష్యన్ నవలలు మరియు రష్యన్ సాహిత్యం. నెల్లూరిలో కానీ, తిరుపతిలో కానీ మంచి పుస్తకాల షాపులు (పాఠ్యపుస్తకాలు, గైడ్స్ కాక) లేకపోవడంతో తరచూ విజయవాడ నుంచి వచ్చే విశాలాంధ్ర బుక్ హౌస్ బుక్ స్టాల్ లో పుస్తకాలు కొనుక్కునే వాడిని. రంగురంగుల కవర్లలో, ప్రముఖ రష్యన్ సాహిత్యకారుల పుస్తకాలు Progress Publishers, Raduga Publishers, ద్వారా తక్కువ ఖరీదుతో ప్రచురించబడేవి. Karl Marx, Lenin, Engels, Trotsky రచనలు ఎక్కువగా కనబడేవి. అయితే నా కళ్ళు ఎక్కువగా Political Economy, Philosophy కన్నా నవలల కోసం వెతికేవి. మొదటిసారి నాకు రష్యన్ సాహిత్యం పరిచయం లేకపోయినా నవలల Sectionలో ఉంచబడిన కొన్ని పుస్తకాలను ఎంపిక చేసుకున్నాను. నేను ఎంచుకున్న పుస్తకాలు Maxim Gorky ‘అమ్మ’ మరియు Ivan Turgenev రచన ‘తండ్రులు-కొడుకులు’ ఈ రెండు రచనలు నా మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపాయి. ఎంతగా అంటే ఈ రోజుకీ నేను తండ్రులు-కొడుకులు నవలను మొదటిసారి చదివినప్పుడు కల్గిన అనుభూతిని ఎలా మర్చిపోగలను? నాకు తెలిసిన కథా రచన, కథా ప్రపంచానికి భిన్నమైన ఈ ఉద్విగ్నభరితమైన, మహత్తర రచనలు, సమాజంలో నేనప్పటి వరకు దర్శించ లేకపోయిన పార్శ్వాలను నాకు పరిచయం చేశాయి. జీవితానికి అర్థం ఎంత ఉదాత్తమైనదీ, ఎంత అనిశ్చితి, అవాంతరాలతో కూడుకున్నదీ అని నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా తండ్రులూ-కొడుకులూ నవలలో, చిన్న వయసులోనే వారికి దూరమైన కుమారుడు బజరోవ్ సమాధి వద్ద ఆయన వృద్ధ తల్లిదండ్రులు దైన్యంగా విలపించడం, వారి కొడుకు స్మృతికి దగ్గిరగా ఉన్న ఆ ప్రాంతాన్ని విడిచిపోలేకపోవటం, ఎంతటి ఉద్వేగ భరిత హృదయమైనా, ఎంతటి ఉద్విగ్నతతో కూడిన జీవనమైనా, ప్రకృతి ధర్మాన్ని ఎవరూ నియంత్రించలేరని చెబుతూ అనునయంగా రచయిత తన కథను ముగించే విధానం నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది. ఉత్తమ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించిన విధానం కూడా కావచ్చునేమో. కొన్ని పదుల పేజీలు నేను నా పుస్తకాలలో రష్యన్ సాహిత్యం గురించి వ్రాసుకున్నాను. నా అభిప్రాయంలో ఆంగ్ల సాహిత్యంతో సమానంగా రష్యన్ సాహిత్యం పోటీ పడలేకపోయినా, ఒక్క నవలను మాత్రమే పరిశీలించి చూస్తే, రష్యన్ భాషలో వెలువడిన నవలలను (ఒక కాలంలో) ప్రపంచ సాహిత్యానికే వన్నెతెచ్చినవిగా, ఆ దేశపు నవలాకారుల సమగ్ర సాహిత్య సృష్టిగా అభివర్ణించవచ్చు.
పై రెండు నవలలతో బాటు మరి కొన్ని రచనలు నేను English Translation లో తీసుకున్నాను. Crime and Punishment, Notes from the Underground, Tales of the White Nights, Brothers Karamazov, The Idiot, Dead Souls, Anna Karenina, The Death of Ivan Ilyich, The Cossacks, Eugene Onegin, Dr. Zhivago, A Hero of our Time, And Quiet Flows the Don, The Forged Coupon, Prisioner of the Caucasus, Russian Short Stories లాంటివన్నీ ఒక 5 సంవత్సరాల కాలంలో చదివాను.
తండ్రులూ-కొడుకులూ నవల తర్వాత నేను చదివిన రష్యన్ నవల Crime and Punishment. Dostoevsky రచించిన ఈ మనోవైజ్ఞానిక, సామాజిక నవల నాకు నవలాకారుడి దృక్పథం, స్పృహ, విశ్లేషణా సామర్థ్యం, సామాజిక వాస్తవికత లోని గాఢతను తెలియ చెప్పింది.
ప్రపంచ సాహిత్యంలో William Shakespeare తర్వాత అత్యంత ప్రజామోదం, ప్రజాదరణ కలిగిన సాహిత్యకారుడిగా Dostoevsky చరిత్రలో నిలిచిపోతారు. Albert Camus, Nietzsche, Hemingway, Virginia Woolf, Franz Kafka లాంటివారు ఆయన రచనల నుంచి ప్రేరణ పొందారు. Albert Einstein లాంటి శాస్త్రవేత్త “Dostoevsky gives me more than Gauss” అని ఆయనను ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా కీర్తించారు.
Raskolnikov విషాద గాధ తర్వాత అత్యంత జటిలమైన Brothers Karamazov నవల కొనుక్కున్నాను. కానీ దానిని చదివే సాహసం చేయలేకపోయాను. దాదాపు ఒక సంవత్సరం తర్వాత రెండో సంవత్సరంలో చదివినట్టు గుర్తు. Dostoevsky రచనలో ప్రగాఢమైన విశ్వాసం గోచరిస్తుంది. మానవ జీవితం మోసం, కపటాలతో కూడుకున్నదైనా, అత్యంత నిశ్చలమైన, పవిత్రమైన ఆత్మజ్యోతి శక్తివంతమైనదని, కేవలం పై పై మెరుగులతో కూడిన ఆధ్యాత్మికత కాదని, Dostoevsky భావిస్తాడు. అశాంతి, అలజడితో కూడిన జీవులకు ఓదార్పుతో కూడిన ఉపశమనం, ప్రేమతత్వం తో కూడిన దైవిక మతం ద్వారా లభిస్తుందని Dostoevsky తన రచనల్లో తెలియజేసినట్లు అనిపిస్తుంది.
“When everything is lost, Beauty will save the world”
ఏది ఏమైనా Dostoevsky రచనలు, ఆయన ప్రాపంచిక దృక్పధం, శైలి, world view అత్యంత సంక్లిష్టమైనదిగా భావించాలి. వేదాంతం, తర్కంలో చర్చించదగిన అత్యంత కఠినమైన, జటిలమైన విషయాలను ఆయన రచనల్లో మనం చూడవచ్చు.
Dostoevsky జీవితం విరుద్ధమైన భావాలకు నిలువెత్తు నిదర్శనం. రష్యా చక్రవర్తి జార్ ఆగ్రహానికి గురికాబడి మరణశిక్ష అమలకు సైబీరియా ప్రాంతానికి తరలించబడతాడు Dostoevsky. మరణశిక్ష అమలు కాబోతున్న మరికొద్ది క్షణాల్లో వచ్చిన వార్తాహారి ద్వారా జార్ సవరింపబడిన ఆజ్ఞ తెలుసుకొని మరణశిక్ష యావజ్జీవ శిక్షగా మార్పు చేయబడుతుంది. వివిధ రకాల నేరాలకు శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తుల మధ్య Dostoevsky తన శిక్షను అనుభవిస్తాడు. అక్కడ అతను చూసిన పలువురు నేరస్తులు, వారి అనుభవాలు, వారిలోని దైన్యం, నైరాశ్యం, పరితాపం బహుశా అతని నవలా ప్రపంచంలోని సన్నివేశాలకు బీజం వేసిందేమో? మనిషి అంతరంగంలోని అనంతమైన కాంక్షను, శోధనను, వేదనను Dostoevsky దర్శించాడు. అతని రచనలు కేవలం నవలలుగా కాక తనను ఆలోచింపజేసిన శోధనలకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నమని కూడా మనం భావించవచ్చు. యింతటి ప్రతిభాశాలి జూద వ్యసనానికి లోనయ్యాడన్నది ఒక విస్తు గొలిపే నిజం.
Notes from the Underground, Idiot నవలలు తర్వాత చదవడం జరిగినది. Dostoevsky నవలల్లో అత్యద్భుత రచన, అన్ని రకాల సిద్ధాంతాలు “ideas” ను శోధించడానికి, చర్చించడానికి Dostoevsky గీసిన బృహత్తర, తులనాత్మక గ్రంథం Brothers Karamazov. ఈ నవల ఆధ్యంతం విభిన్నమైన సంగీతాల మేళవింపు లాగా అనిపిస్తుంది. ఒక రాగం శ్రావ్యంగా, లాలనగా ఉంటే మరొక రాగం భయానకంగా, బీభత్సంగా ఉంటుంది. మరొక నాదం అపశృతితో, కఠోరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. యిన్ని విభిన్న మేళవింపుల మధ్య తన పాత్రలను ఉంచి వారిని అణువణువూ, సమూలంగా పరీక్షించినట్లుగా అనిపిస్తుంది. అన్ని విధాలైన grand ideas నమ్మకం-నాస్తికత్వం, నేరము-పరితాపము, కాంక్ష-త్యాగం, లాంటి themes ను Dostoevsky ఈ నవలలో ప్రధానంగా ప్రస్తావించారు.
Brothers Karamazov నలుగురు కొడుకుల గురించి రాయబడిన ఈ నవలలో, మనకు నలుగురు భిన్న మనస్తత్వాల వ్యక్తులు తారసపడతారు. భావోద్వేగ సంపన్నుడు మరియు యింద్రియ ప్రేరణ గలవాడు Alexei, హేతువాది లేదా నవీన మేధావికి ప్రతిరూపం Ivan, ప్రశాంతచిత్తుడు, దైవ బలం గలవాడు, Alyosha మరియు Fyodorకు వివాహబంధం వెలుపల జన్మించిన Smerdyakov ఈ నవలలో ప్రధాన పాత్రధారులు.
వీరిలో Alyosha తప్ప, మిగతా ముగ్గురికీ వారి తండ్రితో పెనవేసుకున్నటువంటి ఘర్షణా పూరితమైన సంబంధమే నవలలో ప్రధాన యితివృత్తంగా మనం భావించవచ్చు. నగరంలోని మతిస్థిమితం లేని అమ్మాయి ద్వారా Fyodor కు జన్మించిన Smerdyakov, తన తండ్రికి సేవకుడిగా ఉంటూ అతనినే ద్వేషిస్తూ ఉంటాడు. మనిషి అంతరంగంలో యిమిడి ఉన్న కపటాన్ని, ద్వేషాన్ని, మరో పార్శ్వాన్నీ వెలుపలికి బయల్పరచడం రచయిత అంతరంగమా? Dostoevsky సాహిత్యంలో ఈ బ్రహ్మాండమైన పోరాటం (the moral tussle) (the novel of ideas) ఒక యితివృత్తాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా అన్ని దృక్కోణాలలో నుంచి పరిశోధించడం, (examination) ఒక ప్రధానమైన లక్షణంగా మనం భావించవచ్చు. తను ఊహించుకుంటున్న సామ్యవాద లక్ష్యాలను, సమసమాజ నిర్మాణాన్ని సాధించే పోరాటంలో భాగంగా తను చేసిన హత్యలకు తుది వరకు Raskolnikov తనను తాను సమాధానపరుచుకోగలడా? తను అంతగా ఆరాధించిన Father Zosima, దైవాంశ సంభూతుడు కాదని అందరిలాగే అతను సాదాసీదా మనిషేనని మహిమాన్వితుడు కాదని తన తోటి వారు యితరులు హేళన చేస్తుంటే ఆయన పట్ల (మరొక విధంగా క్రీస్తు బోధనల పట్ల) Alyosha అచంచలమైన విశ్వాసం చెరగకుండా ఉండగలదా? తండ్రితో విభేదించిన Alexei మరియు Ivan ఈ భేదాలను సామరస్యంగా పరిష్కరించగలరా? లేదా ఆవేశపూరిత మోహంలో ఏదైనా హింసకు పూనుకుంటారా? .
వారు ఈ పోరాటంలో విజయం సాధించగలరా అన్నది అప్రస్తుతం. కానీ ఈ arena, ఈ గోదాంలో నేరము – శిక్ష, నమ్మకం, నాస్తికత్వం- ప్రేమ, వ్యామోహం లాంటి grand questions. సిద్ధాంతాలను Dostoevsky తర్కిస్తారు. Dostoevsky నవలల్లో Polyphonic Voice (విభిన్న స్వరాల సమ్మేళనం ఉన్నట్లుగా సాహిత్య విమర్శకుడు Mikhail Bakhtin ప్రతిపాదించారు. ఈ విధంగా పాశ్చాత్య సిద్ధాంతాలకు భిన్నంగా Dostoevsky తన రచనల్లో వ్యవహరించారని ఆయన ప్రతిపాదించారు. అనగా వ్యక్తి, , వ్యక్తిత్వం అన్నదానిని ఎన్నటికీ నిర్దుష్టమైన నిర్ణయాత్మకమైన model లేదా చట్రంలో మనం బిగించలేము. మనిషి ప్రవర్తన, ఆలోచన, వారి సమగ్ర మానసిక విశ్లేషణలో అంతిమత్వం అసాధ్యం అన్న భావన Dostoevsky సాహిత్యానికి ఆపాదించవచ్చని ఆయన సూచించారు. Brothers Karamazov చదవడం నాకొక ప్రగాఢమైన అనుభూతి. Father Zosima, Father Ferapont ల మధ్య సంఘర్షణ. ఒకే అమ్మాయిని, తండ్రి మరియు తనయుడు మోహించడం, నవలలోని Grand Inquisition అధ్యాయం యివన్నీ నన్ను నిశ్చేష్టుడిని చేశాయి. ఆంగ్ల సాహిత్యానికి, రష్యన్ సాహిత్యానికి భేదం అందులోనే నేను గమనించగలిగాను. చీకటితో కూడుకున్న మనిషి అంతరంగం, కామం, క్రోధం, మోహం, నాస్తికత్వం లాంటి వ్యతిరేక భావాలు ఈ ప్రపంచంలో అంతా బాగానే ఉన్నది అనే భావనను పటాపంచలు చేశాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది యదార్థం? ఏది సహేతుకం? ఏది వికలం? లాంటి ప్రశ్నలు నన్ను తొలచి వేశాయి. యిన్ని విరుద్ధ, విభిన్న భావాల మధ్య Aloyshaను రచయిత తీర్చిదిద్దిన విధానం నన్ను ఆలోచింపజేసింది. సమంగా, స్థితప్రజ్ఞతతో వ్యవహరించడం ఆయన రచనల్లోని పాత్రలకు (ఒకటి రెండు మినహా) దాదాపు అసాధ్యం.
Dostoevsky మరొక రచన Notes from the Underground ఆయన తదుపరి రచనలు, అత్యద్భుత సాహిత్య సృష్టికి నాంది ప్రస్తావన లాంటి రచనగా మనం భావించవచ్చు. పేరు లేని కథానాయకుడితో చెప్పబడిన ఈ కథలో Dostoevsky తన పాఠకులను, పాఠక లోకాన్ని ప్రేరేపించి, బాధించి, కలవరపెట్టి, తృణీకరించి, కదిలించాడు.
ఈ రచన యొక్క ప్రభావం, దాని పరిధి ఎంత విస్తృతమైనదీ అంటే Dostoevsky సాహిత్యానికి, రాబోయే యూరోపియన్ సాహిత్యానికి ప్రేరణ కారకాలను అది ప్రస్తావించింది. అలాగే ఆనాటి కాలంలో అత్యంత ఆందోళనకారక మరియు విధ్వంస పూరిత రచనగా అది ఖ్యాతి కెక్కింది.
“ప్రతి కథకు ఒక కథానాయకుడు అవసరం అని మీరునుకోవచ్చు. Dostoevsky నవలలోని ఏకాంత వ్యాఖ్యాత యిలా అంటాడు. కానీ ఈ నవలలో ఒక ప్రతినాయకుడు లేదా విరుద్ధ నాయకుడికి (anti-hero) ఉండవలసిన లక్షణాలన్నీ ఈ వ్యక్తికి ఉన్నాయి. యివన్నీ చాలా అసహ్యంగా అనిపించవచ్చు. కానీ దగ్గిరగా గమనించండి. మీకన్నా యింకా ‘జీవం’ ఉన్నవాడిని నేను. అని Dostoevsky తన పేరు లేని నాయకుడితో అనిపిస్తాడు. నేను అనే వ్యాఖ్యానంలో మొదలయ్యే ఈ రచన మనం అనే ప్రయోగంతో ముగుస్తుంది. Dostoevsky రచనా విధానం, పాఠకులను ప్రతినిత్యం పాలుపంచుకునేలా చేస్తూ అన్నింటికీ బాధ్యత వహించమనేలా చేస్తుంది. తప్పుకొని, ప్రక్క నుంచి చూడడం అనేది పాఠకులకు ఈ నవలలో లభించని అవకాశం.
ఆధునిక మానవుడి అస్తిత్వ ప్రశ్నను, ఒంటరితనాన్ని ఆనందం కోసం చేసే అన్వేషణను విభిన్నమైన రీతిలో ఓడిసి పట్టుకునేందుకు ఈ రచన ప్రయత్నించింది. 1864 లో విడుదలైన ఈ నవల మొదటిసారిగా యిలాంటి ప్రశ్నలు సంధించింది. ఈ విషయంలో తన కంటే ముందు రచించిన Nikolai Gogol తో Dostoevsky కు కొంత సారూప్యత ఉన్నది.
క్రొత్త నేత్రాలతో లోకాన్ని దర్శించడం నాకు రష్యన్ సాహిత్యం నేర్పింది. ప్రపంచం యింత విభిన్నంగా ఉంటుందా? సమాజంలో యిలాంటి వ్యక్తులు సంచరిస్తుంటారా? మనసు యిన్ని భావాల సమూహమా? రచయిత అంతరంగాన్ని తొలిచే ఆలోచన (విధానం) యింత తీవ్రంగా ఉంటుందా? మానవ సమాజంలోని వేదనను యింత ఖచ్చితంగా దర్శించడం సాధ్యమా? అన్నింటినీ మించి రచనా శైలిలోని వ్యంగ్యం, తనను తాను విమర్శించుకుంటూ రచయిత ఎక్కుపెట్టే విమర్శనాస్త్రం; మునుపెన్నడు నవలలలో కనిపించని, దర్శించని యితివృత్తాలు అప్పటివరకు నేను చదివిన రొమాన్స్ popular నవలల కంటే క్రొత్తదీ, చదువుతున్నప్పుడే కలచి వేసేది, నా మానస పరిక్రమను పూర్తిగా ఆవహించిన రష్యన్ సాహిత్యం నన్ను కట్టివేసింది. Dostoevsky కంటే ముందు తరం రచయిత Nikolai Gogol రచన ‘Dead Soul’ రష్యన్ సాహిత్యంలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలను మనకు తెలియ చెబుతుంది. 1) వ్యంగ్యం 2) యదార్థవాదం 3) సామాజిక దృక్పథం 4) పాత్రల చిత్రీకరణ మరియు 5) భావజాలం. పై లక్షణాల్లో కొన్ని Anton Chekhov రచనల్లోనూ మనం ప్రస్ఫుటంగా గమనించవచ్చు. Chekhov కధలు The Lady With the Dog, The Bet మరియు Pushkin రచన The Queen of Spades, Gogol రచన The Overcoat లేదా The Cloakలు జీవితం లోని సంక్లిష్టతను, శూన్యతను మనకు చేరవేస్తాయి. Alexander Pushkin రచించిన Eugene Onegin రష్యన్ సాహిత్యంలోని మొట్టమొదటి మహా గ్రంధంగా భావించడం జరుగుతోంది. నిరాశవాదం, నిస్పృహ, వ్యంగ్యం, మనుష్య ప్రవర్తన మరియు పరివర్తన పట్ల అపనమ్మకం ఒకవైపు నిలువెత్తు మానవతావాదం, మనిషిలోని అంతర్గత దయ, కరుణపై అపారమైన విశ్వాసం, భగవంతునిపై నమ్మకం మరొక వైపు ఈ రెండు దృక్కోణాలు, వైరుధ్యాల మధ్య నా సాహిత్య పిపాసకు, సృజనకు రష్యన్ నవల ఉద్దీపన యిచ్చింది.
Nikholai Gogol నవల Dead Souls (మృత ఆత్మలు అనే కంటే అజ్ఞాత ఆత్మలు అనవచ్చునేమో) అలనాటి రష్యన్ సమాజం యొక్క పెత్తందారీ వ్యవస్థలో వేళ్ళూనుకున్న ఆక్రమం, అవినీతి, నిర్ధాక్షిణ్యం, అసమానత్వం, అమానుషాన్ని అత్యంత వెటకారపు ధోరణిలో ఎండగడుతుంది. ధనిక భూస్వామ్యుల కొలువులో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న చిన్న సన్నకారు రైతు కూలీలను అటు యిటూ తర్జుమా చేసి ఆ క్రమంలో చనిపోయిన కూలీలను కూడా బ్రతికే ఉన్నట్లుగా చూపిస్తూ కథలోని ప్రధాన పాత్రధారుడు Chichikov మాయ చేస్తూ ఉంటాడు. ఈ Chichikov మారుతున్న రష్యన్ సామాజిక వర్గం లోని ధన స్వామ్యపు వర్గానికి ప్రీతిపాత్రుడు. అవినీతిని అందంగా రంగులద్ది అమ్మి వేయగల సమర్థుడు. మాటలకు తేనెలద్దేవాడు. ఎవ్వరిని నొప్పించడు.
పొగడ్తనే తన ఆయుధంగా మలుచుకునేవాడు. యిటువంటి హీరోతో (నిజానికి నాయకత్వ లక్షణాలు యితనిలో లేవు) Gogol రష్యన్ సమాజాన్ని అత్యంత వాస్తవిక దృష్టితో
పరికిస్తాడు. సమాజ స్థితి జుగుప్సాకరంగా ఉండడం (grotesque) అది ఆయన రచనల్లో ప్రతిబింబించడం ఆయన తప్పు కాదు కదా!
రష్యా మహాకవి Pushkin తన Eugene Onegin లో సామాజిక ఆచారాలు కట్టుబాట్ల యొక్క అమానవీయతను యితివృత్తంగా మలిచారు. Onegin, తాత్యానాల మధ్య నడిచే విఫల ప్రణయ గాధను అత్యంత సుందరంగా మలచిన ఈ పద్య కావ్యం రష్యన్ సాహిత్యంలో మొట్టమొదటి ఆణిముత్యంగా భాసిల్లుతోంది. 18వ శతాబ్దంలోనే Pushkin కవి, కళ, అభిరుచుల సమూహమే మనిషి. ఆ మనిషి అస్తిత్వం ప్రబలమైన రోజు, వ్యక్తికీ అతని జీవితానికి, నిజానికి, కల్పనకూ మధ్య వ్యత్యాసం ఉంటుందని రచించారు. Gogol రచించిన The Cloak, The Overcoat, కధానికను ప్రపంచ సాహిత్యంలోనే అత్యద్భుతమైన రచనల్లో ఒకటిగా నేటికీ కీర్తిస్తారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఒక దిగువ మధ్యతరగతి ప్రభుత్వ గుమస్తా, చలి నుంచి కాపాడే సరైన ఉన్ని కోటు లేక యిబ్బంది పడుతుంటాడు. ఎట్టకేలకు కష్టపడి కొంత సొమ్ము పొదుపు చేసి, అదృష్టవశాత్తూ కొంత సంపాదించి, తన అభిరుచికి తగిన కోటును (Cloak) కుట్టించుకుంటాడు. కథలో ప్రధానంగా మన కథానాయకుడు, ఈ కోటు గురించి చర్చించడం, వర్ణించడం, వివిధ ముడిసరుకులు ఎంపిక చేసుకోవడం లాంటివి విస్తారంగా ఉన్నాయి. ఒక శుభ ముహూర్తాన ఈ కోటు సిద్ధమవుతుంది. తక్కిన స్నేహితులు, సిబ్బంది, శుభాకాంక్షల నడుమ ఈ కోటను ధరించి Bashmachkin ‘ఆఫీసుకు వస్తాడు.’ ఆఫీసులో ఉన్నతాధికారి ఈ కోటు ధరించిన సందర్భంలో ఒక పార్టీ ఏర్పాటు చేస్తాడు. పార్టీ అనంతరం మామూలు సమయం కన్నా ఆలస్యంగా ఇంటికి వెళుతున్న Bashmachkinను యిద్దరు దుండగులు అడ్డగించి, తన్ని కోటు లాక్కుని, మంచులో వదిలేసి వెళ్ళిపోతారు.
ఈ తస్కరణ పై ఫిర్యాదుకు ఎలాంటి స్పందన రాకపోగా, అందర్నీ హడలెత్తించే ఒక ఉన్నతాధికారి యింత చిన్న విషయాన్ని తన దాకా ఎందుకు తీసుకువచ్చినట్లు, చెప్పాలని Bashmachkinను తృణీకరించి అవమానపరుస్తాడు. కార్యాలయ సిబ్బందికి
లేని బాధ్యత, జవాబుదారితనంపై Bashmachkin చెప్పిన దానికి అతనిని విపరీతంగా తులనాడడం జరుగుతుంది. ఆందోళనతో, జ్వరం బారినపడి చిత్తభ్రమ లోకి జారుకుంటాడు Bashmachkin. యిలాంటి మానసిక స్థితిలోంచి Bashmachkin మృత్యుఓడిలోకి జారుకుంటాడు.
Akaky శవాన్ని St. Petersburg లో పోలీసులు కనుగొంటారు. ఆ తరువాత Akaky ప్రేతాత్మ St. Petersburg లోని అధికారులకు కనబడుతూ, భయపడుతూ వారి కోటును సంగ్రహిస్తుంటుంది. చివరికి తన ఫిర్యాదును పట్టించుకోక ఏవగించుకున్న అధికారికి కనబడి అతని కోటును తీసుకోవడంతో, Akaky ఆత్మ కనుమరుగవుతుంది. ఈ కథలో Gogol ప్రవేశపెట్టిన వాస్తవికత, మరియు grotesqueness, వక్రత అత్యద్భుత రీతిలో ఉంటాయి.
అధివాస్తవికత (Surrealism) మరియు వికృతత్వాన్ని (grotesque) సాహితీ ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా ప్రపంచం సాహిత్యంలో Gogol ప్రవేశపెట్టాడని చెప్పుకోవచ్చు. Gogol రచనల నుంచి Dostoevsky, Bulgakov, Flannery O’Connor, మరియు Franz Kafka లాంటివారు స్ఫూర్తి పొందారు. Gogol విశిష్టత ను, Nabokov తన సాహితీ విమర్శలో కొనియాడారు.
Gogol వారసత్వాన్ని పుచ్చుకొని తదనంతర కాలంలో Dostoevsky అనేక రచనలు చేశారు. మానవ జీవితంలోని సంఘర్షణను దర్శించి పాఠకులకు చేరవేయడం ఒక అంకమైతే, ఈ సంఘర్షణతో పాటు, ప్రపంచానికీ, సమాజానికీ, ఉద్దాతమైన భావాలను చేరవేస్తూ సమాజంలో ఉన్నటువంటి కాంక్ష మోసం, ద్వేషం, వేదన లాంటి వాటిని అంతమొందించిన నాడే నిజమైన మానవ కళ్యాణం, విశ్వ మానవ సౌభ్రాతత్వం సిద్దిస్తుంది. అని తన కథల ద్వారా Leo Tolstoy చేరవేస్తాడు. ఆయన రచనల్లో ప్రధానంగా The Forged Coupon/Prisioner of the Caucasus, The Three Hermits, God Sees The Truth But Waits, Little Girls Wiser Than Men, How Much Land Does A Man Need, లాంటి రచనలు నన్ను ఆద్యంతం కదిలించాయి. ఈ రచనల్లోని కరుణ, దైవిక భావం, నమ్మకం ఎవరినైనా కదిలించగలవు. Tolstoy రచనల్లో అంత శక్తి ఉన్నది.
The Death of Ivan Ilych మరియు The Cossacks నవలల్లో Tolstoy సృజన కొంత భిన్నంగా అనిపిస్తుంది. పై లక్షణాల కంటే కూడా, రష్యన్ సాహిత్యానికి స్వభావికమైన తత్వ శోధన, తార్కిక అన్వేషణ, జీవితం, జీవనం, సమాజం గురించి లోతైన విశ్లేషణ మనకు గోచరిస్తాయి. కానీ God Sees The Truth But Waits లాంటి రచనలో Tolstoy కరుణరసం శిఖరాలను అందుకున్నాడని చెప్పవచ్చు. ఈ short storyని నేను CBSE 12వ తరగతి విద్యార్థులకు English బోధిస్తున్న సమయంలో చదవడం జరిగింది. Syllabus లో భాగంగా ఈ కథను చర్చించడం జరిగింది. ఈ పాఠ్యాంశాన్ని చర్చిస్తున్నప్పుడు Aksionov దీన గాధ విన్న తర్వాత తరగతిలో సానుభూతి చూపని వారు ఎవ్వరూ లేరు. తనకు జరిగిన అన్యాయానికి ఎవ్వరినీ నిందింపక, తన అపకారిని కూడా క్షమించి, తన హృదయాన్ని నిర్మలత్వంతో, నిష్కల్మషం చేసుకుని, భగవంతుని నిర్ణయానికి తన జీవితాన్ని అర్పించుకోవడం, పాషాణాన్ని కూడా కదిలించి వేస్తుంది.
How Much Land Does A Man Need కధలో Tolstoy మానవ అంతరంగంలోని కాంక్ష, వ్యామోహం, దురాశలను చిత్రీకరించగలిగారు. ఎంత భూమి కొలుచుకోగలవో అంతవరకు నీదే అన్న ఒక్క మాటతో, ఎంతో దూరం వెళ్ళిపోయి, తిరిగి రాలేక ఆకలికీ దప్పికకూ వడలిపోయి చనిపోయే ఒక దీనుని కథను ఈ కథలో మనం చూడవచ్చు. చివరికి దిక్కు లేక పడి ఉన్న అతని దేహాన్ని ఖననం చేయడానికి, ఆరడుగుల నేలను ఎంచుకుంటారు కూలివాళ్ళు. The Raid కధలో ధైర్యం, సాహసం అనే లక్షణాలపై రచయితకు, యుద్ధ రంగంలో ఆరితేరిన సైనిక నిపుణుడికీ మధ్య చర్చ జరుగుతుంది. గుర్తింపు, మెప్పు, ఆత్మ స్తుతి, పరుల పొగడ్తల కోసం చూపే తెగింపు నిజమైన ధైర్యం క్రిందకు రాదని వారు తీర్మానిస్తారు. అప్పుడే యుద్దానికి, మరీ ముఖ్యంగా ముందుండి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు త్సార్ సైన్యంలోనికి అలెనిన్ అనే చురుకైన యువకుడు వస్తాడు. టార్టార్ తెగల పై యుద్దానికి తన లెఫ్టినెంట్ తో కలిసి అతను ముందుకు ఉరుకుతాడు. Captain Pavel సూత్రం ప్రకారం, కుటుంబం కోసం, ఆత్మ సాక్షి ప్రభోదం
ప్రకారం, సాహసం ప్రదర్శించక, వెన్నక్కి తగ్గినా దానిని పిరికితనం అనరాదు అని చెబుతాడు. అలెనిన్ దూకుడు అనర్ధాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తాడు. టార్టార్ తెగల యుద్ధంలో కెప్టెన్ పావెల్ తన బృందం తో కలిసి వెనకడుగు వేస్తాడు. దూకుడుగా వెళ్ళిన అలెనిన్, విరోచితంగా పోరాడి, విగత జీవుడై మిగులుతాడు.
The Forged Coupon నవలలో అనర్ధాలు, మోసం, అబద్దం, ఏ విధంగా పలువురిని బాధిస్తోందో, పలు జీవితాలను స్పృశిస్తుందో తెలియజేస్తారు. The Death of Ivan Ilych ఒక బాధాకరమైన నవల. ఈ నవలలో Tolstoy, Kafka, శూన్యవాద నవలలైన The Trial, మరియు Metamorphosis లోని పాత్రలలాగా తన హీరోను తీర్చిదిద్దారా అనిపిస్తుంది. దైనందిన, సాధరణ ‘అసమర్ధ’ వ్యక్తుల జీవితాలలోని దుర్భరాన్నీ మానసిక, భావ దారిద్యాన్ని చిత్రీకరించి, మార్గదర్శనం చేశాడా అనిపిస్తుంది. అలాగే Cossacks నవలలో Olenin పాత్ర ద్వారా, నగరాల్లోని మనుషుల భావజాలం ఎంత కుటిలంగా ఉంటుందో వారి ధైర్యం ఎంతటి స్వార్ధపూరితమో, మరియు వారితో పోలిస్తే, పట్టణపు హోయలు, నాజుకుతనం లేని Cossacks లో మొరటుతనం అందులోని తెగువ, తెంపరితనం ఎంత స్వచ్చంగా ఉంటుందో మనకు తెలియజేస్తాడు. Maryanka పాత్ర ద్వారా చదువుకోకపోయినా గ్రామీణ యువతి సంస్కారం ఎంత ఉన్నతమయినదీ ఆమె ప్రేమ, అనురాగం, ఎంత విలువైనవో మనకి తెలియచేస్తాడు. War and Peace, Resurrection యింకా చదవలేదు. Anna Karenina మాత్రం చదవడం తటస్తించింది.
నేను రష్యన్ సాహిత్యం కోసం తరచూ వెతికేవాడిని. Bookfairs లేదా Mobile Book Exhibitions లో నేను చదవని రష్యన్ నవలలు, కధా సంపుటాల కోసం చూసేవాడిని. రష్యన్ సాహిత్యంలో నేను కనుగొన్న సహానుభూతి, సమగ్రమైన జీవిత, తార్కిక విశ్లేషణ నన్ను కట్టిపడేసేది. అక్కడక్కడా చదివిన రీత్యా, నేను చదవని పుస్తకాలు Alexander Pushkin – Eugene Onegin, Anton Chekhov, Lermontov – A Hero of Our Times, కధలు ఎక్కడ దొరుకుతాయో అని వెతికేవాడిని.
O. Henry లాగా కధలను వ్రాయడంలో Anton Chekhov ఎంతో ప్రఖ్యాతి గాంచారు. ప్రపంచ సాహిత్యంలో Shakespeare తర్వాత ఎక్కువ మంది చదివే రచయతగా Chekhov రచనలు ఖ్యాతి గాంచాయి. ముఖ్యంగా రష్యన్ దృక్పధం అని మనకు మనం చిత్రీకరించుకునేందుకు వీలుగా అయన చేసిన రెండు అద్వీతీయమైన రచనలు, The Bet, మరియు Lady With the Dog రచనల గురించి చెప్పుకోవాలి. చదవగా నాకు రష్యన్ సాహిత్యంలో కొన్ని Uniform Themes గోచరించాయి. శోధన, తపన, మౌలికమైన జీవిత సత్యాలను తర్కించుట, ప్రేమ, అనురాగం, ద్వేషం, నమ్మకం, ఆస్తికత్వం, నాస్తికత్వం, మానవత్వం, వర్గ పోరాటం, వివక్ష, విభేదాలు, మతం, విశ్వాసం, యిలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ రష్యన్ నవలాకారులు వారి రచనల్లో ప్రస్తావించారు. మచ్చుకు నాకు హాస్యం ఎక్కడా అగుపించలేదు. Mark Twain లేదా O. Henry ల humorism, Bernard Shaw లాంటి Satirical Intent కనబడలేదు. తండ్రులూ -కొడుకులూ నవలలో Turgenev సృష్టించిన బాజరోవ్ పాత్రనే తీసుకుందాం. సమాజం పట్ల నిరసన, నాస్తికత్వం, మానవ సంబంధాలు, బాంధవ్యాల పట్ల విముఖత, Nihilism లేదా అవ్యవస్థీకృత, అరాచకత్వాన్ని నమ్మే ఈ మనిషిలో సుకుమార సుడిగుండాలను, ప్రేమ అంకురరార్పణను రచయిత ఎంత బలీయంగా అణచివేస్తాడో మనం చక్కగా చూడవచ్చు. రచయితకు ఈ విప్లవకారుడి పట్ల వాత్సల్యం మెండుగా ఉన్నా ఈ విప్లవ అరాచక ధోరణి 17 వ శతాబ్దపు రష్యన్ సమాజాన్ని ఎలా పెనుఉత్పాతం లోకి నెట్టిందో నవలాకారుడు చక్కగా ఆవిష్కరించారు.
అంతటి విప్లవ హృదయాన్ని ప్రేమించడంలో ఎటువంటి ఎల్లలు, అరమరికలు, చూపని బాజరోవ్ తల్లిదండ్రుల పట్ల రచయిత తన అపారమైన ప్రేమను కనపరుస్తాడు. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయిన తమ కుమారుడి స్మృతి చెదిరి పోనీయక,
శ్మశానంలో గడిపే వృద్ధ తల్లిదండ్రుల బాధ అందరి కళ్ళు చెమర్చేలా చేస్తుంది. రష్యన్ సాహిత్యంలోని ఈ తార్కిక, వేదాంత దృష్టి, సత్యశోధన, కళ యొక్క మూలం, సామర్థ్యం, సత్యాన్వేషణ లో తుదకంటూ సాహిత్యాన్ని అభ్యాసన పెట్టడం రష్యన్ చలనచిత్రాలలో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. Andrei Tarkovsky చిత్రాలు Andrei Rublev, The Mirror లాంటి వాటిలో కళ పరిమితిని శోధించేందుకు నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా The Cranes are Flying, A Soldier’s Father, The White Tiger, Two Davids, The Island, White Sun of the Desert లాంటి చిత్రాల్లో సామాన్యుల జీవితాల్లోని ఆశ, నిరాశ, ఆనందం, విషాదం, నేరం, పశ్చాత్తాపం, యుద్ధం, అధికార వికృత క్రీడ లాంటి అంశాలు చక్కగా సృజించబడ్డాయి.
ఆలోచింపజేసే, సామాజిక దృక్పథంతో కూడిన ‘విషయం’ రష్యన్ సినిమా సొంతం. Tarkovsky సినిమా Andrei Rublev ఆదర్శానికీ, అనుభవానికీ మధ్య నడిచే అధివాస్తవిక సంఘర్షణను అద్భుతంగా ఆవిష్కరించింది. అలాగే Puduvokin ‘Mother’, ‘Sergei Eisenstein’, ‘Battleship Potemkin’ (దర్శకుల సినిమా, సినిమా వ్యాకరణానికి ఉద్గ్రంధం) లో సమాజం పట్ల కళాకారుడికి కావలసిన నిబద్దత, పీడి త, తాడిత వర్గాల వైపు నిలబడి, వారి గొంతుక ఎలుగెత్తి చాటడం మనం చూడవచ్చు. యిందులోని కొన్ని Scenes, Sequences ఉదా: Steps, scene యిప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. రష్యన్ సాహిత్యం రష్యన్ సినిమాను ప్రభావితం చేసిందా లేక అక్కడి కళాకారుల ఆలోచనా పరంపర, ప్రాపంచిక దృష్టి, సమాజాన్ని నిశిత పరిశీలన చేయడం లక్షణంగా చేసుకుందా?
ఏది ఏమైనా Brothers Karamazov నవల నాలో నిశ్చలమైన మార్పును తీసుకొచ్చింది. ఈ నవలను అన్వయించుకుని ప్రపంచంలోని disharmony disjunctionను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను.
Dostoevsky తన రచనల్లో యదార్ధాన్ని, పాత్రల్ని పరిపక్వత లేదా ప్రాముఖ్యత (heroism glory) కోసం తీర్చిదిద్దరు. అవి అపరిపక్వంగా, అసంబద్ధంగా తమ లయ లోని అనిశ్చితి, ఆందోళన మధ్య వాటి దారి వెతుక్కుంటాయి. ప్రశాంత మహాసముద్రం, శాంత గంభీరమైన Tolstoy రచనల్లోని ఆత్మ దృష్టి నాకు Dostoevsky లో గోచరించలేదు. ఆ స్థానంలో నిరంతర శోధన, సత్యాన్వేషణ నన్ను గుచ్చి ప్రశ్నించినట్లు అనిపించింది.
నేను చదివిన రష్యన్ సాహిత్యం 19వ 20వ శతాబ్దాలకు సంబంధించినది. ఆధునిక రష్యన్ సాహిత్యంతో నాకు బొత్తిగా పరిచయం లేదు. And Quiet Flows the Don తర్వాత నేను రష్యన్ నవలలు అస్సలు చదవలేదు. Chinghiz Aitmatov ‘Jamilya’, మరియు Alexei Tolstoy ‘అయిలీత’ లోని రమ్యమైన ప్రకృతి వర్ణన, పల్లె సౌందర్యం, రష్యన్ సమాజంలో గ్రామీణ జీవితం లోని నిర్మలత్వాన్ని, స్వచ్ఛతను చక్కగా ప్రతిబింబింప జేస్తాయి. గ్రామీణ పాత్రలు, యువతీ యువకులు, వారి ఆలోచన విధానంలోని అమాయకత్వం, సరళ స్వభావం, మానవ సమాజంలోని లక్షణాల విశ్వజనీయత చాటి చెబుతాయి. జమీల్యా’ నవలలోని జమీల్యకు చలం నవలలోని మైదానం నాయిక రాజేశ్వరికీ సారూప్యత కనబడుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ (రష్యన్) సాహిత్యం, సినిమాలలో యుద్ధానికి సంబంధించిన యితివృత్తాల ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. సుదీర్ఘకాలం జరిగిన ఈ యుద్ధం, జనజీవన స్రవంతి పై ఆలోచన సరళి పై అపారమైన ప్రభావం చూపించింది. యుద్ధం వదిలి వెళ్ళిన విధ్వంసం, బీభత్సం, ఆంగ్ల, జర్మన్, సాహిత్యాలలో శూన్యవాదం, నిరాశవాదం, ధిక్కారవాదం లాంటి ధోరణులను ప్రోత్సహిస్తే (Brecht, Beckett, Ionesco, Camus, Sartre, Kafka, Pirandello) రష్యన్ సాహిత్యం సినిమాలలో యిది సైనిక శ్రామికుడి త్యాగం, సంఘర్షణ, యుద్ధం యొక్క శూన్యత, నిరర్థకత, మరియు రష్యన్ సమాజం యొక్క ధైర్య సాహసాలు, మానసిక నైర్మల్యం, కుటుంబ విలువల ప్రాధాన్యత వంటి యితివృత్తాలను ప్రతిబింబించింది. The Cranes are Flying, Father of a Soldier, White Sun of the Desert, Two Fyodors, Soldier’s Ballad, Prisioner of the Caucasus లాంటి సినిమాలు యిలాంటి యితివృత్తాలలోనే నిర్మించబడ్డాయి.
రష్యన్ సాహిత్యంలో అంతర్లీనంగా ఉండే ప్రశాంత గంభీర స్వభావం, అఖండమైన నిశ్చలత్వం ఈ సినిమాలలో కూడా మనం చూడవచ్చు. అయితే ప్రపంచానికి పరిచయమైన సోవియట్ కథలు, యితివృత్తాలకు ఆవల కమ్యూనిస్ట్ రష్యాలో జరిగిన భయంకరమైన అణచివేత, రాజ్యహింస గురించి విభ్రాంతి గొలిపే నిజాలను ప్రస్తావిస్తూ తర్వాతి కాలంలో వ్రాయబడిన Solzhenitsyn పుస్తకం ‘The Gulag Archipelago’ రష్యన్ సాహిత్య లోకాన్ని మరియు దాని పట్ల ప్రపంచ దృక్కోణాన్ని ఒక కుదుపు కుదిపిందని చెప్పవచ్చు. అసలైన Bolshevik కమ్యూనిస్టులను, మరియు శ్రామిక విప్లవ రథసారధులను స్టాలిన్ నీయంతృత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని, వారి స్నేహితులు, అనుయాయులు, కుటుంబ సభ్యులను Stalin హయాంలో ఏ విధమైన అణిచివేత, ఆటవిక శిక్ష, మానసిక, శారీరక హింసకు గురి చేశారో ఈ పుస్తకంలో రచయిత విపులంగా తెలియజేస్తాడు. ఒక మనిషి మాత్రమే కూర్చోగల జైలు గదిలో నలుగురిని కూర్చోబెట్టడం, ఆకలికి మాడ్చడం, నిద్ర పోనివ్వక పోవడం, రకరకాల చిత్రహింసలు, 72 గంటలు వెనుకకు ముందుకు కదలలేని జైలు గదిలో నిలబెట్టడం, విచారణ సమయంలో నగ్నంగా నిలబెట్టడం, మొహం మీద మూత్రం పోయడం, target కోసం అక్రమ అరెస్టులు చేయడం, కాల్చివేయడం లేదా నామరూపాలు తెలియని విధంగా Siberia పంపడం, యివన్నీ Tsar నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న కమ్యూనిస్టు రష్యాలో అమలయిన భయానకమైన శిక్షలు. సమకాలీన చట్టాలు. స్వేచ్ఛ, సమానత్వం కోసం నిరంకుశవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన కమ్యూనిస్టు రిపబ్లిక్ లో యివి నిజంగా జరిగాయా అని ప్రపంచానికి తెలియజెప్పిన సంచలన నవల ‘The Gulag Archipelago’.
నాయికా నాయకులు, పాత్రలు, కథ లేకపోయినా The Gulag Archipelago నవల ఎలా అయ్యింది? An Experiment in Literary Investigation మరియు non-fiction అని దీన్ని వర్గీకరిస్తున్నారు. కానీ నవలకు కావలసిన ముఖ్యమైన లక్షణం graphicness, (విపులీకరణ, విషయం, వస్తువుపై సమగ్రమైన విశ్లేషణ, అనుభవ సారాంశ, నివేదన ఈ పుస్తకంలో మనం చూడవచ్చు.
భారతీయ సాహిత్యం, యితిహాసంలో కనబడే వైరాగ్యం, వస్తువు పట్ల విముఖత, ఆధ్యాత్మిక లోతులను కనుగొనే ప్రయత్నం, రష్యన్ సాహిత్యం లో మనకు వేరే విధంగా గోచరిస్తుంది. సామాజిక జీవనం, వ్యక్తిత్వ సంఘర్షణ, చారిత్రక స్పృహ, కాలగమనం పట్ల అవలోకన, మరీ ముఖ్యంగా రష్యన్ భూమి, భాష పట్ల గౌరవం, ఆరాధన మనకు కనిపిస్తుంది. ఉదా: In the Land of the White Nights.
1987లో ప్రచురింపబడిన ఈ పుస్తకం నాకు రష్యన్ సాహిత్యం పైన ఉన్న మక్కువను మరింతగా పెంచింది. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉన్న Arkhangelsk ప్రాంతంలోని రచయితల కథలు, కథానికల సంకలనమే ఈ పుస్తకం. నాజీ జర్మనీ పై జరిగిన పోరాటంలో పాల్గొన్న సైనిక వీరులు, ధీరులు, వీర మహిళల గాధలను, వారి అనుభవాలను మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. ఆత్మ శోధన, అన్వేషణ ఒక మార్గం అయితే, రష్యన్ ప్రజల నిరాడంబరత, శ్రమైక జీవనం, పాట, నృత్యం, సంతోషం లాంటి సామాన్యమైన ఆనందాలను పంచుకునే వారి సంస్కృతి ఈ కథలలో మనం చూడవచ్చు. యుద్ధం వదిలి వెళ్ళిన దుర్భర పరిస్థితులు, ముంచుకొస్తున్న యాంత్రీకరణ, ఆధునికీకరణతో మారుతున్న సామాజిక జీవనం, కనుమరుగువుతున్న సమూహ జీవన సరళి, పల్లెటూరి సంస్కృతి అంతర్ధానం పట్ల ఆవేదన, ఈ రచనలలో మనం చూడవచ్చు. ఆనాటి రష్యా గ్రామాల్లో జీవితం చాలా ప్రశాంతంగా లేదా సహజంగా ఉండేదని వారి రచనలు తెలియజేస్తాయి. ప్రకృతికి దగ్గరగా వారి సహజీవనం, కాయలు, పండ్లు, కట్టెలు సేకరించే వారి దినచర్య, తటాకాలు, నదులలో చేసే చేపల వేట, ఎముకలు కొరికే చలిలో నెగడు చుట్టూ చేరి నిర్మలమైన ఉత్తర ధృవ ఆకాశంలో మిల మిల మెరిసే నక్షత్ర తారలను చూస్తూ పాడుకోవడం! జీవితంలోని చిన్ని చిన్ని కోర్కెలు పంచుకోవడంలోని ఆనందం, వ్యక్తిత్వానికి యిచ్చే గౌరవం లాంటి లక్షణాలు మనం ఈ కథలలో చూడవచ్చు. Pine Children, The Veteran’s Song, The River of Forgetfulness, The Tale of Lomonosov, Romanska లాంటి మనసుకు హత్తుకునే కథలు యిందులో ఉన్నాయి. Bulgakov రచన The Master and Margarita రష్యన్ నవల పూర్వ సంప్రదాయాలను కొనసాగిస్తూ మతాన్ని, వేదాంతాన్ని, భావజాలాన్ని, సాహిత్యం లోని శక్తిని అత్యంత వ్యంగ్య శైలిలో చేరవేస్తుంది.