తొలి పూతకై చిగురుటాకు వణికింది.
చల్లచల్లని సాయంత్రం సందెదాకా వచ్చింది
మల్లెపూల సువాసనలు మంచుముద్ద కప్పింది.
తమలపాకు చిగురుపూత లేలేత నునుపుగా
సౌరభాల మామిడి మొగ్గ వన్నెలన్నీ చిందగా
ఈ ఏడాది ఉగాదికై ఉదయభానుడు వేచగా
ప్రకృతికే కొత్త వలపు పులకరింత మాటున
వయ్యారపు సింగారాల వన్నెలే విచ్చుకొని
ఆమని పాటలు ఏటి నీటిలో ముంచుకొని
వగరు వగరు మావి కొమ్మ వీనుల విందుగా మీటెనే
పచ్చపచ్చని ఉగాదికి పల్లెటూరి పాటనే
Poems
May 2022