Poems Sep 2024

మనసు లోని మాట

దూరం, ఊరు, బాల్యం, స్నేహం, ఇంటి జ్ఞాపకాలు — మనసులో మిగిలే తియ్యని బాధను పలికించే జ్ఞాపకాల కవిత.

మనస్సులో దాచుకున్నాను ఒక మాట
చిన్నతనంలో ఆడుకున్న ఒక ఆట
ఆ గాలి ఆ మట్టిలేవని అలసి
అయినా అయినా సాగాలి మనిషి
కష్టం కపటం తెలియని స్నేహం
అమ్మ ఇల్లు అన్నదే లోకం
ఇల్లు వదలి ఊరు వదలి
కదిలి కదిలి మదిలో మెదిలే
నదిని వదలి నావను వదలి
వెళ్లే మనిషి నీకెంత కష్టం
చెట్టు చేమ అన్నీ ఉన్నా
చెట్టు నీడ క్రిందికే వస్తే
టౌన్ సిటీ కాలనీ అన్నీ
మనవే మనవే అనుకోవలసి వస్తే
అన్నం తిన్నా ఆకలే ఉన్నా
అడిగేవారు లేరులే అన్నా
మంచి మాట చెప్పేది ఉంటే
ఊరి నుంచి వచ్చే కబురే అంటే
దూరం ఎంతో భారం ఎంతో
నీకు ఊరికి నీటికి నదికి
ఎప్పుడో ఏదో ఊరికే వెళితే
ఏదో తియ్యని బాధే పుడితే
మిత్రులెక్కడ నేస్తాలెక్కడ
వోరగా ఎగిరే పక్షులేవి
ఎర్రగా విరిసే పువ్వులేవీ
మనసులో గుబులుగా చీకటే నిండితే
రోజుకో సూర్యుడు వంగిపోయి జారితే
ఊసులే ఊహలై రాలిపోయిన ఆకులై
బాల్యమే ప్రార్థనయి ఆగిపోయిన శ్వాసగా
దూరమై దూరమై

Share Your Comments

I would love to hear your thoughts.