ప్రేమ (కానని) కధలు — Part 2
ఎప్పుడైనా ఐశ్వర్యం లోని వేదన గమనించావా ? నా ఫ్రెండ్ ఒక ఇంటి వైపు చూపిస్తూ నన్ను అడిగాడు . నేను సమాధానం చెప్పే లోపల అతనే “ వాంఛ, ఆశయం, కోరికల సాధనే ముఖ్యం అనుకునే ఈ ప్రపంచంలో తాతలు సంపాదించిన ఆస్తిని ఏమి చేయాలో తెలియక , ఎలా అనుభవించాలో అర్ధం కాక కొంత మంది వ్యక్తులు మనకు అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఛెకొవ్ లాంటి రచయితలు అయితే అందు లోని వేదనను ఇట్టే పసికట్టగలరు…